అజారుద్దీన్‌పై బీజేపీ విమర్శలు... కిషన్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

  • అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి అక్కసు ఎందుకని మండిపాటు
  • ఆయనపై ఏం కేసులు ఉన్నాయో సమాధానం చెప్పాలని నిలదీత
  • భారత జట్టు సారథిగా ఎన్నో విజయాలు సాధించారన్న మహేశ్ కుమార్ గౌడ్
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఆయనపై ఏం కేసులు ఉన్నాయో సమాధానం చెప్పాలని ఆయన కిషన్ రెడ్డిని నిలదీశారు.

భారత జట్టు సారథిగా ఆయన ఎన్నో విజయాలను అందించారని అన్నారు. ఎంపీగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. అలాంటి అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మూడు నెలల క్రితం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. కాగా, తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.


More Telugu News