మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వ్యక్తి.. ప్యారడైజ్ లో కలకలం

––
సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం కలకలం రేగింది. మెట్రో స్టేషన్ లోకి వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెట్రో స్టేషన్ పైనుంచి అతడు కిందకు దూకాడు.

మెట్రో సిబ్బంది వేగంగా స్పందించి గాయాలపాలైన ఆ వ్యక్తిని అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెట్రో సిబ్బంది ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News