పట్టాలపైకి చేరిన వరద.. డోర్నకల్‌లో నిలిచిన రైళ్లు.. వీడియో ఇదిగో!

––
మొంథా తుపాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ స్టేషన్ లో వరద నీరు పట్టాలను ముంచెత్తింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, మహబూబాబాద్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ లను భద్రతా కారణాలరీత్యా రైల్వే అధికారులు నిలిపివేశారు.


More Telugu News