'జైలర్ 2'లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్!
- సంచలన విజయం సాధించిన 'జైలర్'
- సెట్స్ పైకి వెళ్లిన సీక్వెల్
- విలన్ పాత్రలో మిథున్ చక్రవర్తి
- కీలకమైన పాత్రలో విద్యాబాలన్
రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో తప్పకుండా కనిపించేది 'జైలర్'. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించాడు. 200 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కథాకథనాలతో పాటు, అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది.
'జైలర్ 2' సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మొదటి భాగంలో ఉన్న ఆర్టిస్టులు ఈ సీక్వెల్ లో కొనసాగనున్నారు. అయితే బాలీవుడ్ నుంచి ఒక సీనియర్ స్టార్ ను .. సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఆ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి అయితే, ఆ బాలీవుడ్ భామ విద్యాబాలన్. ఈ ఇద్దరివీ ఈ సినిమాలో కీలకమైన పాత్రలనీ .. చాలా పవర్ఫుల్ పాత్రలని తెలుస్తోంది.
'జైలర్'లో లోకల్ రౌడీగా వినాయకన్ చెలరేగిపోయాడు. అయితే ఈ సీక్వెల్లో విలన్ గా మిథున్ చక్రవర్తి కనిపించనున్నాడు. ఆయన కూతురు పాత్రలో విద్యాబాలన్ కనిపించనుందని అంటున్నారు. 'జైలర్ 2' 1000 కోట్లు రాబట్టడం ఖాయమనే నమ్మకంతో రజనీ అభిమానులు ఉన్నారు. వాళ్ల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో .. వాళ్ల ఆశలను ఎంతవరకూ నిజం చేస్తుందో చూడాలి మరి.