హరీశ్ రావు ఇంట విషాదం.. సంతాపం తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్

  • మాజీ మంత్రి హరీశ్‌ రావు ఇంట విషాదం
  • ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి
  • సంతాపం ప్రకటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌
  • సత్యనారాయణ మృతి బాధాకరమన్న లోకేశ్‌
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
  • హరీశ్‌ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీశ్‌ రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ స్పందిస్తూ, "తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మృతి బాధాకరం. వారికి అశ్రు నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను" అని పేర్కొన్నారు.

హరీశ్‌ రావు కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ కష్టకాలంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.


More Telugu News