హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య

  • ఆత్మహత్య చేసుకున్న ఇండిగో ఎయిర్ హోస్టెస్ జాహ్నవి
  • రాజేంద్ర నగర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకున్న ఎయిర్ హోస్టెస్
  • తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లో ఒక ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 28 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ జాహ్నవి, రాజేంద్రనగర్‌లోని ఒక ప్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆమె తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

జమ్మూకు చెందిన జాహ్నవి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి విందులో పాల్గొన్నట్లు సమాచారం. స్నేహితులు లేని సమయంలో ఆమె ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. జాహ్నవి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News