రష్యా నుంచి చమురు కొనుగోలు.. ట్రంప్ ప్రభుత్వంపై జైశంకర్ ఆగ్రహం

  • ఇంధన కొనుగోళ్ల విషయంలో ఒక్కోదేశం పట్ల అమెరికా ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని విమర్శ
  • నీతులు చెప్పేవారు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • ఆసియాన్ సదస్సులో జైశంకర్ వ్యాఖ్యలు
రష్యా చమురు విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒక్కో దేశంతో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నీతులు బోధించేవారే వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియాన్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం 25 శాతం సుంకం విధిస్తున్న విషయం విదితమే. చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, యూరప్ దేశాలపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియాన్ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియోతో జైశంకర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News