ఈ సమయంలో ఇటువంటి ప్రచారాలా?: పవన్ కల్యాణ్ ఫైర్
- మొంథా' తుపానుపై అసత్య ప్రచారాలు
- వదంతులు నమ్మవద్దని ప్రజలకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
- కాకినాడలో వాతావరణం ప్రశాంతంగా ఉందని వెల్లడి
- రేపు రాష్ట్ర తీరాన్ని దాటనున్న మొంథా తుపాను
- అధికారిక సమాచారం కోసం కలెక్టర్, పోలీసు ఖాతాలను చూడాలని సూచన
- విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్‌ను 'మొంథా' తుపాను సమీపిస్తున్న వేళ, సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ఆయన హెచ్చరించారు.
రేపు రాత్రి మొంథా తుపాను రాష్ట్ర తీరాన్ని దాటనుందన్న నేపథ్యంలో, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే తుపాను ప్రభావం తీవ్రంగా ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రస్తుతం కాకినాడలో వాతావరణం ప్రశాంతంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.
తుపాను పరిస్థితిపై వాస్తవ సమాచారం కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని సూచించారు. ఆయా ఖాతాల ద్వారా వెలువడే సమాచారం, సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపత్కర సమయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వదంతులను వ్యాప్తి చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన హితవు పలికారు.