గెలిస్తే అనుమానం వస్తుందని బీహార్‌లో బీజేపీ గెలవదు: కేఏ పాల్

  • బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని గెలిపిస్తుందన్న పాల్
  • ఈవీఎం ఉన్నంత వరకు బీజేపీయే అధికారంలో ఉంటుందని వ్యాఖ్య
  • బ్యాలెట్ వధానం కోసం తాము పోరాడుతున్నామన్న కేఏ పాల్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవదని, ఆ పార్టీయే ఆర్జేడీని గెలిపిస్తుందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో అసలైన ఓట్లను తొలగించి, లేని ఓట్లను చేర్చారని ఆరోపించారు. దేశంలో ఈవీఎం ద్వారా ఓటింగ్ ఉన్నంత వరకు బీజేపీ అధికారంలో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

బీహార్‌లో బీజేపీ గెలిస్తే దేశ ప్రజలకు అనుమానం వస్తుందనే ఆలోచనతో అక్కడ ఆర్జేడీని గెలిపిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరగాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాలెట్ విధానం కోసం తన పార్టీ పోరాడుతోందని కేఏ పాల్ పేర్కొన్నారు.


More Telugu News