అమెరికాలో విమాన సర్వీసులపై షట్ డౌన్ ఎఫెక్ట్.. వేలాది విమానాల ఆలస్యం

  • ఆదివారం ఒక్కరోజే 8 వేల విమానాల ఆలస్యం
  • జీతాలు అందకపోవడంతో విధులకు హాజరుకాని సిబ్బంది
  • షట్ డౌన్ ఇలాగే కొనసాగితే తీవ్రం కానున్న సమస్య
అమెరికాలో విమానయాన సంస్థల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా జీతాలు అందకపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడంలేదు. తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ బాయ్ లు గా మారిపోయారు. జీతాల్లేకుండా పనిచేయడం తమవల్ల కాదని చెబుతున్నారు. దీంతో సరిపడా సిబ్బంది లేక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

ఆదివారం ఒక్కరోజే దాదాపు 8 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన 22 ప్రాంతాల్లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది కొరత ఏర్పడిందని అమెరికా రవాణా మంత్రి శాన్‌ డఫీ వెల్లడించారు. ప్రభుత్వ షట్ డౌన్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీంతో విమానాలు ఆలస్యంగా నడవడం, సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని వివరించారు.

ఫ్లైట్‌ అవేర్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం..
సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో దాదాపు 2 వేల విమానాలు, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1200 విమానాలు, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 739, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 600 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.


More Telugu News