రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పనులు పూర్తి

  • ఈ నెల 31న విడుదల కానున్న రవితేజ 'మాస్ జాతర' 
  • ప్రీమియర్స్ వేసేందుకు రంగం సిద్దం చేస్తున్న చిత్ర బృందం
  • యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్‌ పొందిన మాస్ జాతర
రవితేజ కథానాయకుడిగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా, సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ పొందింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర బృందం నూతన పోస్టర్‌ను విడుదల చేసింది. "మాస్, ఫన్, యాక్షన్ అన్నీ ఒకే చోట! వినోదాత్మక మాస్ వేవ్‌ను థియేటర్లలో ఆస్వాదించండి" అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు.

సినిమా నిడివి 160 నిమిషాలుగా నిర్ణయించబడగా, అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

'ధమాకా' చిత్రం తర్వాత రవితేజ - శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, 'మాస్ జాతర' ట్రైలర్‌ను అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 


More Telugu News