Puri Jagannadh: జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో పూరీ జగన్నాథ్, చార్మి పూజలు

Puri Jagannadh and Charmme Kaur offer prayers at Jubilee Hills Peddamma Temple
  • పెద్దమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న పూరీ జగన్నాథ్, చార్మి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పూరి జగన్నాథ్‌, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కుతున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరోయిన్ ఛార్మి కౌర్  జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఆలయంలో వీరిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ డేరింగ్‌ డైరెక్టర్‌గా పేరున్న పూరి జగన్నాథ్‌, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా జనవరి 16న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 

ఈ మూవీకి స్లమ్ డాగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి చిరిగిన దుస్తుల్లో బిచ్చగాడిలా కనిపిస్తూ.. చేతిలో కత్తి పట్టుకుని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చాడు. 

ఈ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తోంది. అలాగే టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్‌, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, జేబీ నారాయణరావు కొండ్రోల్లా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

More Telugu News

Puri Jagannadh
Charmme Kaur
Peddamma Temple
Slum Dog
Vijay Sethupathi
Samyuktha Menon
Puri Connects
Tollywood
Telugu cinema