Faridabad Father: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం!

Faridabad Father Arrested for Daughters Sexual Assault
  • ఫరీదాబాద్‌లో 14 ఏళ్ల బాలికపై తండ్రి లైంగికదాడి
  • మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు
  • విషయం బాలిక చెప్పడంతో పొరుగింటావిడ పోలీసులకు ఫిర్యాదు  
  • వైద్య పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన దారుణ నిజం
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు.. నిందితుడు అరెస్ట్
హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపైనే ఓ తండ్రి కొన్ని రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి 42 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ కారణంగానే అతడి భార్య కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల వారి పెద్ద కుమార్తె తండ్రితోనే ఉంటోంది. ప్రతిరోజూ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చే నిందితుడు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడేవాడు.

తండ్రి పైశాచికత్వంతో తీవ్రమైన నొప్పితో బాధపడిన బాలిక, చివరకు ధైర్యం చేసి పక్కింటి వృద్ధురాలికి తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె వెంటనే బాలికను వైద్యుని వద్దకు తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్, బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి, జరిగిన నేరాన్ని బహిర్గతం చేశారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. భూపాని పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Faridabad Father
Faridabad crime
Haryana crime
sexual assault
POCSO Act
minor girl
domestic violence
crime news
India crime

More Telugu News