Pakistan: సౌదీకి సైన్యాన్ని అద్దెకిచ్చిన పాక్

Pakistan to Send Troops to Saudi Arabia in Exchange for 10 Billion Dollors
  • రూ.88 వేల కోట్లతో భారీ డీల్
  • 25 వేల మంది సైనికులను సౌదీకి పంపనున్న పాకిస్థాన్
  • గత నెలలోనే కుదిరిన ఒప్పందం
  • తాజాగా సైనిక బలగాల తరలింపు ప్రక్రియ
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తాజాగా తన సైన్యం సాయంతో నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. సైనిక బలగాలను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీగా నిధులు సమీకరించనున్నట్లు సమాచారం. మిత్రదేశం సౌదీ అరేబియాతో గత నెల కుదిరిన ఒప్పందంలో సైన్యాన్ని అద్దెకు ఇచ్చి రూ.88 వేల కోట్లు అందుకోనుంది. ప్రతిగా పాక్ సైనికులు 25 వేల మందిని సౌదీ అరేబియాకు పంపించనుంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదరగా.. తాజాగా బలగాల తరలింపునకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఏంటీ ఒప్పందం..
సౌదీ అరేబియా, పాకిస్థాన్ పరస్పరం సహకరించుకోవాలని,
ఇరు దేశాల్లో ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం కూడా యుద్ధం చేయాలనేదే తాజా ఒప్పందం. ఇందుకోసం సౌదీ అరేబియా రూ.10 బిలియన్ డాలర్లు (దాదాపు 88 వేల కోట్ల రూపాయలు) పాక్ కు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందుకు గానూ 25 వేల మంది తన సైనికులను పాకిస్థాన్ ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. 

ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. ఒక దేశంపై దాడిని మరో దేశంపై దాడిగా పరిగణించాలనే రక్షణ నిబంధన ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అటు సౌదీ కానీ ఇటు పాక్ కానీ ఈ ఒప్పందం వివరాలను సౌదీ అరేబియా కానీ, పాకిస్థాన్ కానీ అధికారికంగా వెల్లడించలేదు.
Pakistan
Saudi Arabia
Pakistan army
Saudi Arabia defense
Military agreement
Pakistan economy
Saudi Pakistan relations
Defense pact
Military deployment
Financial aid

More Telugu News