Prashanth Neel: 'దొంగ మొగుడు' అంటూ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత ఫన్నీ పోస్ట్ వైరల్

Prashanth Neels Wife Likitha Reddy Funny Post Goes Viral
  • నలుపు రంగు దుస్తులకే ప్రాధాన్యతనిచ్చే ప్రశాంత్ నీల్
  • తాజాగా తెల్లటి దుస్తుల్లో దర్శనం
  • భర్తను చూసి మురిసిపోయిన భార్య లిఖితా రెడ్డి
కన్నడ స్టార్ డైరెక్టర్, 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల్లోని డార్క్ థీమ్, హీరోలతో పాటు పాత్రధారులంతా నలుపు రంగు దుస్తుల్లో కనిపించడం వంటివి ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించాయి. అయితే, ఎప్పుడూ నలుపు రంగు దుస్తులకే ప్రాధాన్యతనిచ్చే ప్రశాంత్ నీల్, తాజాగా తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మార్పుపై ఆయన భార్య లిఖితా రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన ఓ సరదా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఓ వేడుకలో భాగంగా ప్రశాంత్ నీల్ తెల్లటి దుస్తులు ధరించారు. తన భర్తను అలా చూసి మురిసిపోయిన లిఖితా రెడ్డి, ఆయన ఫొటోను షేర్ చేస్తూ.. "ఫైనల్‌గా నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేశాడు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ప్రశాంత్ నీల్‌ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూసి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ సినిమాల్లోని లొకేషన్లు సైతం బొగ్గు గనులను తలపించేలా డార్క్ షేడ్‌లో ఉంటాయి. ఈ కారణంగా ఆయనకు నలుపు రంగుపై ఎందుకంత ఇష్టమంటూ సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుంటుంది. బెంగళూరులో పుట్టినా తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆయనపై టాలీవుడ్ ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) అనే భారీ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
Prashanth Neel
Prashanth Neel wife
Likitha Reddy
KGF director
Salaar director
Prashanth Neel white dress
NTR Dragon movie
Telugu director
Kannada movies
Tollywood

More Telugu News