జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు... బరిలో 58 మంది అభ్యర్థులు
- నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్
- 58 మంది పోటీ పడుతున్నట్లు తెలిపిన రిటర్నింగ్ అధికారి
- నామినేషన్లు ఉపసంహరించుకున్న 23 మంది
ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో ఉన్నారు.