‘ముంబైలో దిగు, నీ సంగతి చూస్తా’.. విమానంలో ప్రయాణికుడికి బెదిరింపు.. వీడియో ఇదిగో!
- మరాఠీ మాట్లాడలేదని ప్రయాణికుడిపై మహిళ ఆగ్రహం
- ఘటనను వీడియో తీసి పోస్ట్ చేసిన కంటెంట్ క్రియేటర్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళ సహ ప్రయాణికుడిపై భాష పేరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. మరాఠీలో మాట్లాడలేదన్న కారణంతో అతడిని బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మహీ ఖాన్ అనే కంటెంట్ క్రియేటర్ కోల్‌కతా నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా విమానం ఎI676లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణికురాలు అతడితో వాగ్వాదానికి దిగింది. ‘నువ్వు ముంబై వెళ్తున్నావు కాబట్టి మరాఠీలోనే మాట్లాడాలి’ అని ఆమె డిమాండ్ చేసింది. తనకు మరాఠీ రాదని ఖాన్ చెప్పడంతో ఆమె మరింత ఆగ్రహంతో ఊగిపోయింది.
ఈ వివాదం ముదరడంతో మహీ ఖాన్ విమాన సిబ్బందిని పిలిచాడు. వారి ముందే ఆ మహిళ, ‘ముంబైలో దిగు, నీకు మర్యాద అంటే ఏంటో చూపిస్తా’ అంటూ తనను బెదిరించిందని ఖాన్ ఆరోపించాడు. ఈ సంభాషణను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘కేవలం వేరే భాష మాట్లాడినందుకు ఏ ప్రయాణికుడికీ ఇలాంటి అవమానం జరగకూడదు. ఇలాంటి వారిని విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించాలి’ అని ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఖాన్ తన పోస్టులో డిమాండ్ చేశాడు.
ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే వైరల్‌గా మారింది. లక్షకు పైగా లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయి. వీడియోలో సదరు మహిళ హ్యుందాయ్ లోగో ఉన్న షర్ట్ ధరించడంతో, నెటిజన్లు ఆ కారు కంపెనీని ట్యాగ్ చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఇది మా మహారాష్ట్ర సంస్కృతి కాదు, భాష పేరుతో బలవంతం చేయడం తప్పు’ అని పలువురు మహారాష్ట్రీయులు సైతం కామెంట్లు పెడుతున్నారు.