భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. ఇద్దరు మహిళలు మృతి.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. తమిళనాడు, దక్షిణ ఏపీకి రెడ్ అలర్ట్
- కడలూరులో భారీ వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు మహిళల మృతి
- సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ సమీక్ష, ప్రత్యేక అధికారుల నియామకం
తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కడలూరు జిల్లాలో కుండపోత వానకు ఓ నివాసం కూలిపోవడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ తమిళనాడులోని చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. చెంగల్‌పట్టు కలెక్టర్ డి. స్నేహ మాట్లాడుతూ, "వర్షాలకు ముందే పూడికతీత పనులు పూర్తి చేశాం. నీటిని తోడే పంపులు, సహాయక కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు సిద్ధంగా ఉన్నాయి" అని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 13 జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తూత్తుకుడి, తిరువారూర్ జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, బోట్లు, చెట్లను తొలగించే యంత్రాలతో పాటు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచారు.