అమిత్ షాకు జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

  • నేడు అమిత్ షా జన్మదినం
  • దేశ నలుమూలల నుంచి వెల్లువెత్తిన విషెస్
  • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన పవన్ 
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా బుధవారం దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కల్యాణ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సేవలో ఆయన ఎల్లప్పుడూ అచంచలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ.. "గౌరవనీయులైన హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవాలు, స్పష్టత, దృఢ నిబద్ధతతో పార్లమెంటులో ప్రభావవంతమైన స్వరంతో ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చే మీ సామర్థ్యం నిజమైన రాజనీతిజ్ఞుడి లక్షణం" అని కొనియాడారు. 

"ఈ ప్రత్యేకమైన రోజున అమిత్ షా గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ధైర్యం ప్రసాదించమని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. దేశ సేవలో ఆయన ఎల్లప్పుడూ అచంచలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. 


More Telugu News