విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం: పవన్ కల్యాణ్

  • పోలీసు అమరవీరులకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి
  • పోలీసుల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి అన్న పవన్
  • శాంతిభద్రతల కోసం పోలీసుల సేవలు అమోఘమని ప్రశంస
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.

"విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను" అని పవన్ పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీసుల సేవలు, వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.

ప్రజా భద్రత, శాంతి పరిరక్షణ విషయంలో పోలీసులు అలుపెరగకుండా పనిచేస్తున్నారని పవన్ ప్రశంసించారు. నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు అభినందనీయమని ఆయన అన్నారు. విధి పట్ల అంకితభావంతో పనిచేసే పోలీసుల త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 


More Telugu News