దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీలో ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక!
- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
- 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
- నేడు నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో వర్షాలు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల అంచనా
- రేపు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, రానున్న 36 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముందుజాగ్రత్త చర్యగా వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో నేడు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం నాటికి వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రేపు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.