హాస్టల్ విద్యార్థినులతో కలిసి యాచారం పోలీసుల దీపావళి వేడుకలు
––
ఈ వేడుకల్లో ఎస్సైలు మధు, ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలతో కలిసి టపాసులు కాల్చి, స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ.. చదువు ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుందని అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకోవాలని ఆయన సూచించారు.