హెచ్-1బీ ఫీజుపై అమెరికా కీలక ప్రకటన.. వారికి మినహాయింపు!
- లక్ష డాలర్ల హెచ్-1బీ ఫీజుపై స్పష్టతనిచ్చిన అమెరికా
- ప్రస్తుతం వీసా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదు
- దేశంలోనే స్టేటస్ మార్చుకునే వారికి పూర్తి మినహాయింపు
- కొత్తగా అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసేవారికే ఈ ఫీజు
హెచ్-1బీ వీసాలపై అమెరికా వెళ్లే విదేశీ వృత్తి నిపుణులకు భారీ ఊరట లభించింది. వివాదాస్పదంగా మారిన లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) అప్లికేషన్ ఫీజుపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ రుసుము నుంచి పలు వర్గాలకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ టెకీలు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన కేవలం అమెరికా బయట ఉండి, కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగి ఉన్నవారు అమెరికాలోకి ప్రవేశించడానికి గానీ, దేశం విడిచి వెళ్లడానికి గానీ ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా అమెరికాలో ఉంటూనే ఇతర వీసా కేటగిరీల నుంచి హెచ్-1బీ వీసా స్టేటస్‌కు మారేవారికి ఈ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. ఉదాహరణకు, ఎఫ్-1 విద్యార్థి వీసాపై ఉండి హెచ్-1బీకి మారాలనుకునే వారికి ఈ నిబంధన వర్తించదు. అలాగే, తమ వీసాను పొడిగించుకోవాలనుకునే వారికి, సవరణలు (amendment) కోరుకునే వారికి, లేదా స్టేటస్ మార్చుకునే వారికి కూడా ఈ భారీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తన ప్రకటనలో పేర్కొంది. కొత్త దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ పేమెంట్ లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చినట్లు ట్రంప్ అప్పట్లో తెలిపారు. అయితే, ఈ నిబంధన చట్టవిరుద్ధమని, అమెరికా వ్యాపారాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తూ దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంస్థ ‘యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ రెండు రోజుల క్రితమే ప్రభుత్వంపై దావా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా స్పష్టతను ఇచ్చింది. కాగా, 2024లో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందడం గమనార్హం.