ఉండవల్లి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్న సీఎం చంద్రబాబు దంపతులు

  • రాష్ట్రవ్యాప్తంగా దీపావళి శోభ
  • ఉత్సాహంగా బాణసంచా కాల్చిన చంద్రబాబు, భువనేశ్వరి
  • భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలోని తమ నివాసంలో వెలుగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో సీఎం దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

దీపావళిని పురస్కరించుకుని చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు తమ నివాసంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటి ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా బాణసంచా కాల్చారు. ముఖ్యంగా చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాలుస్తూ సీఎం దంపతులు పండుగ సంబరాల్లో మునిగిపోయారు.

ఈ వేడుకల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. అందరూ ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుని పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ వేడుకలతో పండుగ శోభ వెల్లివిరిసింది.


More Telugu News