పున్నమిఘాట్ లో దీపావళి వేడుకలు... సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
- రాబోయే పదేళ్లలో ఏఐతో ఏపీలో ఊహించని అభివృద్ధి జరుగుతుందన్న చంద్రబాబు
- వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని వెల్లడి
- 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా
రాబోయే పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని అభివృద్ధిని సాధించి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, భవిష్యత్తులో ఏఐకి ఏపీ చిరునామాగా మారితే, విశాఖపట్నం దాని ప్రధాన కేంద్రంగా (హెడ్‌క్వార్టర్‌గా) ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఆదివారం ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు ఆయన తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని అన్నారు. గతంలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా సుమారు రూ.15 వేల వరకు ఆదా అవుతోందని వివరించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గత ఐదేళ్ల పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నరకాసురుడిని వధించిన రోజునే దీపావళి జరుపుకుంటామని గుర్తుచేస్తూ, 2019-24 మధ్య రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసుడిని ప్రజలు తమ ఓటుతో ఓడించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి ఆటలు వద్దని, అలాంటివి పునరావృతమైతే రాష్ట్రం సర్వనాశనమవుతుందని హెచ్చరించారు. రాజకీయ మూర్ఖత్వంతో కొందరు ఇష్టానుసారంగా మాట్లాడతారని, అలాంటి వారి మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన విమర్శించారు.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పూర్తి చేసి చూపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా, నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులు తిరిగి పట్టాలెక్కాయని, రాబోయే మూడేళ్లలో రూ.60 వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమని, అప్పుడు ప్రతి పేద కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు విజయవాడలో శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.