మళ్లీ ఆగిన మ్యాచ్.. భారత్​ స్కోరు 52/4

––
వర్షం నిలిచిపోవడంతో మొదలైన ఆట రెండు ఓవర్ల తర్వాత మరోసారి ఆగిపోయింది. ప్రస్తుతం 16.4 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (3), అక్షర్ పటేల్ (14) ఉన్నారు. ఇప్పటికే మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించిన అంపైర్లు.. తాజాగా మళ్లీ వర్షం కురుస్తుండడంతో మరోమారు ఓవర్లను కుదించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను 32 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గడంతో ఆట ప్రారంభమైంది.

కుదించిన ఓవర్లలో ఇద్దరు బౌలర్లు ఏడేసి ఓవర్లు చొప్పున, మరో ముగ్గురు బౌలర్లు ఆరేసి ఓవర్లు వేసే అవకాశం ఉంది. కాగా, అంతకుముందు లెగ్‌సైడ్‌ పడిన బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన.. శ్రేయస్‌ 11 పరుగుల వద్ద కీపర్ ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 45 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ ను కోల్పోయింది. అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. తిరిగి వర్షం పడుతుండడంతో మ్యాచ్ ఆగిపోయింది.


More Telugu News