అంబర్ పేట ర్యాలీలో కిందపడిన వీహెచ్

  • బీసీ బంద్‍‌కు మద్దతుగా అంబర్‌పేటలో ర్యాలీ
  • బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు
  • వీహెచ్‌ను లేపి సపర్యలు చేసిన నాయకులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బంద్‌కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుతో సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ ర్యాలీ సందర్భంగా ఫ్లెక్సీ పట్టుకుని ముందు నడుస్తున్న వి. హనుమంతరావు బ్యానర్ తట్టుకుని ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. వెంటనే నాయకులు ఆయనను పైకి లేపి సపర్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతమైంది. యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు.


More Telugu News