జర్మనీ అమ్మాయిని పెళ్లాడిన నెల్లూరు అబ్బాయి

  • జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న నెల్లూరు యువకుడు గిరీశ్
  • నర్సుగా పని చేస్తున్న కథరీనాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిన వైనం
  • ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నెల్లూరులో ఘనంగా  హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం
ప్రేమకు దేశాలు, భాషలు, సంస్కృతులు అడ్డుకావని మరోసారి రుజువైంది. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు జర్మనీకి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే, నెల్లూరుకు చెందిన గిరీశ్ గత కొన్నేళ్లుగా జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న కథరీనాతో అతనికి పరిచయం ఏర్పడింది, అది ప్రేమగా మారింది.

గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల పెద్దలను వివాహానికి ఒప్పించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం నిన్న వీరి వివాహం జరిగింది. నెల్లూరు నగరంలోని ఓ కల్యాణ మండపంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

జర్మనీ నుంచి వచ్చిన అతిథులు హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి వేడుకల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


More Telugu News