Narayana: వర్మ గురించి నేను అలా అనలేదు: మంత్రి నారాయణ

Minister Narayana Clarifies Comments About Varma
  • ఎన్డీఏలో విభేదాల్లేవన్న మంత్రి నారాయణ 
  • తన మాటలు వక్రీకరించారన్న మంత్రి నారాయణ 
  • పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ గురించి తాను అలా అనలేదని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. వర్మతో కలిసి ఆయన నిన్న విశాఖలో పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఫిఠాపురంలో సమస్యలు జీరో చేశామనే తన వ్యాఖ్యను, వర్మను జీరో చేశామంటూ వక్రీకరించి వైరల్ చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం దురుద్దేశపూరితమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏలో ఎలాంటి విభేదాలు లేవని, అన్ని పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని తెలిపారు. "పేటీఎం బ్యాచ్ చేసే ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. 
Narayana
Varma
Pithapuram
TDP
Minister Narayana
Andhra Pradesh Politics
NDA
Vishakhapatnam
Former MLA Varma
Political Controversy

More Telugu News