దూలపల్లి పాలిమర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

  • హైదరాబాదు శివారు దూలపల్లి పారిశ్రామికవాడలో సంభవించిన అగ్నిప్రమాదం
  • ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో ఎగసిపడుతున్న మంటలు
  • రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా
హైదరాబాదు శివారు దూలపల్లి పారిశ్రామికవాడలోని ఒక పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దట్టంగా పొగలు కమ్మేయడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పేట్ బషీర్‌బాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


More Telugu News