కేంద్ర ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ మోసాలు: తెలంగాణ పోలీసుల హెచ్చరిక
- వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే మెసేజ్‌లను చూసి మోసపోవద్దని హెచ్చరిక
- అర్హత చెక్ చేసుకోవాలంటూ పంపించే లింక్స్‌పై త్వరపడి క్లిక్ చేయవద్దని సూచన
- అపరిచితులు పంపించే లింక్స్, మెసేజ్‌లకు స్పందించవద్దన్న తెలంగాణ పోలీసులు
వాట్సాప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింక్స్‌లను పంపి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని నమ్మబలుకుతారని పేర్కొన్నారు. అర్హతను పరిశీలించుకోవాలని ఆశ చూపుతూ లింక్‌లను పంపుతారని, వాటిపై తొందరపడి క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అపరిచితులు పంపించే లింక్స్, సందేశాలకు స్పందించవద్దని సూచించారు.