Priyank Kharge: గూగుల్ ఏపీకి వెళ్లడానికి కారణాలు ఇవే!: కర్ణాటక ఐటీ మంత్రి
- గూగుల్ ఏపీకి వెళ్లడంపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
- ఏపీ ప్రభుత్వం రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందని వెల్లడి
- జీఎస్టీలో 100% రీయింబర్స్మెంట్, భూమి, నీటిపై భారీ డిస్కౌంట్లు
- తాము ఇలాంటి రాయితీలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారంటారని వ్యాఖ్య
- బెంగళూరు జనాభా పెరుగుదలపై ఏపీ వలసదారులను ఉద్దేశించి పరోక్ష విమర్శలు
టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవేనంటూ కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోందని, అందుకే ఆ సంస్థ ఏపీ వైపు చూస్తోందని అన్నారు.
ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, "గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఆ సంస్థకు ఏకంగా రూ.22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఇచ్చింది" అని తెలిపారు. కేవలం నగదు ప్రోత్సాహకాలే కాకుండా అనేక రాయితీలను కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తోందని ఆయన వివరించారు. రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్మెంట్, కంపెనీకి కేటాయించిన భూమిపై 25 శాతం డిస్కౌంట్, నీటి టారిఫ్‌లో కూడా 25 శాతం రాయితీ కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీటికి అదనంగా, విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌ను 100 శాతం ఉచితంగా అందిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
ఈ విషయాలన్నీ బయటకు రావని, కేవలం 'గూగుల్ వచ్చింది' అని మాత్రమే పత్రికల్లో వార్తలు రాస్తారని ఆయన అన్నారు. "అదే మేము కర్ణాటకలో ఇన్ని రాయితీలు ఇస్తే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శిస్తారు కదా?" అని ఆయన ప్రశ్నించారు.
అనంతరం బెంగళూరు జనాభా పెరుగుదల అంశాన్ని ప్రస్తావిస్తూ, "బెంగళూరులో జనావాసం ఎక్కువ అవుతోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే జనావాసం ఎక్కువ అవుతుంది కదా?" అంటూ ఎత్తిపొడిచారు.