Bigg Boss Telugu: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోపై పోలీసులకు ఫిర్యాదు

Bigg Boss Telugu Faces Police Complaint Over Obscenity
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు
  • అశ్లీలతతో యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణ
  • సిద్దిపేటకు చెందిన ఇద్దరు యువకుల ఫిర్యాదు
తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ కార్యక్రమం అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

సిద్దిపేటకు చెందిన కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి అనే ఇద్దరు యువకులు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోలో ప్రసారమయ్యే కంటెంట్ కుటుంబంతో కలిసి చూసేలా లేదని, యువతపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షో ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వారు ఆరోపించారు.

గతంలోనూ బిగ్ బాస్ షోపై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. అయితే, నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Bigg Boss Telugu
Bigg Boss
Telugu reality show
Banjara Hills Police Station
Kamari Srinivas
B Ravinder Reddy
Controversy
Obscenity
Youth
Complaint

More Telugu News