Daggubati Venkatesh: నవంబర్ 14న కోర్టుకు రండి.. దగ్గుబాటి హీరోలకు న్యాయస్థానం ఆదేశం

Court Orders Daggubati Heroes to Appear in Deccan Kitchen Case
  • హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి ఫ్యామిలీకి చిక్కులు
  • వెంకటేశ్, రానా, సురేశ్ బాబు, అభిరామ్‌పై కేసు నమోదు
  • నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
  • పర్సనల్ బాండ్ సమర్పించాలని సూచించిన నాంపల్లి కోర్టు
  • కోర్టు ఆదేశాలను ధిక్కరించారన్న ఆరోపణలపై విచారణ
ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానాలతో పాటు నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్‌లకు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్‌నగర్‌లోని ఓ హోటల్ కూల్చివేతకు సంబంధించిన కేసులో నలుగురూ నవంబర్ 14న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఆ రోజు కోర్టుకు వచ్చి పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే, ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ను కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేశారనే ఆరోపణలపై దగ్గుబాటి వెంకటేశ్, రానా, సురేశ్ బాబు, అభిరామ్‌లపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు ఇచ్చింది.

గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఈ కూల్చివేత జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నమోదైన కేసు విచారణలో భాగంగా దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరు కావడం తప్పనిసరి అని న్యాయస్థానం పేర్కొంది. 
Daggubati Venkatesh
Daggubati Rana
Suresh Babu
Abhiram Daggubati
Nampally Court
Deccan Kitchen Hotel
Film Nagar
Hotel Demolition Case
Court Order

More Telugu News