ఏపీ వంటకాలే కాదు ఏపీలో పెట్టుబడులకూ ఘాటు ఎక్కువే.. మంత్రి లోకేశ్

  • ఆంధ్రాకు పెట్టుబడులతో మన పొరుగువారికి సెగ తగులుతోందన్న లోకేశ్ 
  • ప్రధాని మోదీని కర్నూలుకు స్వాగతించడం గర్వకారణమని వ్యాఖ్య 
  • 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని వెల్లడి
ఆంధ్రా వంటకాలకు ఘాటు ఎక్కువ అని మన పొరుగు రాష్ట్రాల వారు అంటుంటారని, చూస్తుంటే మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు కూడా ఘాటు ఎక్కువే ఉన్నట్లుందని మంత్రి నారా లోకేశ్ చమత్కరించారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పెట్టుబడుల సెగ పొరుగువారికి ఇప్పటికే తగులుతున్నట్లు ఉందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

ప్రధానిని కర్నూలుకు స్వాగతించడం గర్వకారణం..
ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లతో కలిసి మంత్రి నారా లోకేశ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధానిని కర్నూలుకు ఆహ్వానించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని మంత్రి నారా లోకేశ్ తన ట్వీట్ లో వెల్లడించారు.


More Telugu News