అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తాం కానీ: భారత్ షరతు
- సరైన ధరకు లభిస్తేనే ఈ అంశాన్ని ఆలోచిస్తామని వెల్లడి
- ఈ మేరకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడి
- అమెరికా నుంచి చమురు దిగుమతికి ఒప్పందం జరిగితే టారిఫ్ తగ్గే అవకాశం
అమెరికా నుంచి చమురు కొనుగోలుకు భారత్ సిద్ధంగా ఉందని, అయితే సరైన ధర లభిస్తేనే ఈ అంశాన్ని పరిశీలిస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల నడుమ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
అమెరికా నుంచి చమురు దిగుమతికి సంబంధించిన ఒప్పందం కుదిరితే, భారత దిగుమతులపై ఉన్న 50 శాతం సుంకాలు తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
గతంలో అమెరికా భారత్ 22-23 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం కొనుగోలు చేసేది కాదని రాజేశ్ తెలిపారు. సుమారు మరో 12 నుంచి 13 బిలియన్ డాలర్ల విలువైన చమురు కొనుగోలుకు అవకాశం ఉందని చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉంది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అమెరికా అధిక టారిఫ్ విధించిన విషయం తెలిసిందే.