Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Sridhar Babu to deliver keynote at AsBioTech International Conference 2025
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన 'ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025'లో కీలకోపన్యాసం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సుగా పరిగణించబడుతుంది.

ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఈ మేరకు ఆయనను ఆహ్వానించారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం విశేషం. ఈ సదస్సు ఈ నెల 21 నుండి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగనుంది. గత రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తారు. అదే సమయంలో తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను గురించి ఆయన ప్రస్తావిస్తారు.
Go Back to Shorts
Sridhar Babu
Telangana
IT Minister
AsBioTech International Conference 2025
Life Sciences
Australia

More Telugu News