అప్పటికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ... నేను స్టార్ హీరోయిన్: రాశి
- సినిమా నేపథ్యం నుంచి వచ్చిన రాశి
- తొలి సినిమాతోనే దక్కిన పెద్ద హిట్
- పెళ్లి ప్రపోజల్ తానే తెచ్చానన్న రాశి
- తన ఇంట్లో వాదనలు నడిచాయని వెల్లడి
- చాలామంది జలస్ ఫీలయ్యారంటూ వ్యాఖ్య
రాశి .. నిన్నటితరం అందాల కథానాయిక. తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అదృష్టవంతురాలు. అప్పట్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తాజాగా 'హిట్' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. "మా నాన్న .. మా తాతయ్యకి సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉంది. అందువలన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచే వచ్చాను" అని అన్నారు.
" తమిళంలో అరుణ్ విజయ్ జోడీగా ఫస్టు మూవీ చేశాను. ఆ తరువాతనే తెలుగులో 'శుభాకాంక్షలు' చేశాను. నా అసలుపేరు 'విజయలక్ష్మీ'. తమిళంలో నా పేరును 'మంత్ర'గా మారిస్తే, తెలుగులో 'రాశి' అని భీమనేని శ్రీనివాసరావుగారు పెట్టారు. ఆ తరువాత నాకు వరుస హిట్లు పడుతూ వచ్చాయి. అప్పట్లో నాకు లవ్వు అంటే భయం .. అబ్బాయిలంటే ఇంకా భయం. అలాంటిది అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ పద్ధతిని చూసి, పెళ్లి చేసుకుందాం అని నేనే అడిగాను" అని చెప్పారు.
" శ్రీనివాస్ ఓ అసోసియేట్ డైరెక్టర్ .. నేను స్టార్ హీరోయిన్ .. మా పెళ్లి విషయంలో మా ఇంట్లో వాదనలు జరిగాయి. నాకు కరెక్ట్ అనిపించిందంటే ఏ విషయంలోనైనా నేను వెనక్కి తగ్గను. కొన్ని విషయాల్లో నేను మొండిగా ఉంటానని అమ్మకి తెలుసు .. అందుకే ఒప్పుకున్నారు. అప్పటికి యూత్ లో నాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. నేను పెళ్లి చేసుకున్నానని తెలిసి చాలామంది జలస్ ఫీలయ్యారని నాకు తెలుసు" అంటూ నవ్వేశారు.