కష్టాలు దాచేసిన రంగనాథ్ .. చివరి రోజుల్లో 800ల రెంట్ ఇంట్లో!

  • నటుడిగా సుదీర్ఘ ప్రయాణం
  • ఆకర్షణీయమైన రూపం  
  • గంభీరమైన వాయిస్
  • చుట్టుముట్టిన ఆర్ధిక ఇబ్బందులు
  • పరిస్థితులకు పట్టుబడిపోయిన రంగనాథ్

రంగనాథ్ .. వెండితెరపై ఓ నిండుదనం. రంగనాథ్ తెలుగు తెరపై ఒక పెద్దరికం. రాజసం .. హుందాతనం .. గాంభీర్యం .. ఇలాంటివన్నీ కలిపి ఒక్కటిగా పెట్టుకున్న పేరే రంగనాథ్. ఆయన ఎదురుగా నిలబడటానికీ .. ఆయన కళ్లలోకి చూస్తూ డైలాగ్ చెప్పడానికి చాలామంది ఆర్టిస్టులు కంగారు పడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వాయిస్ ధాటిని తట్టుకుని నిలబడగలిగిన ఆర్టిస్టులు ఆ తరంలో చాలా తక్కువమంది ఉన్నారని చెప్పాలి. 

అలాంటి రంగనాథ్ ఆ మధ్య ఈ లోకం నుంచి నిష్క్రమించారు. అప్పట్లో అదంతా హడావిడిగా జరిగిపోయింది. కానీ రీసెంటుగా రంగనాథ్ తనయుడు నాగేంద్ర కుమార్ 'సుమన్ టీవీ'కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. రంగనాథ్ పడిన ఇబ్బందులను గురించి ఆయన చెబుతూ ఉంటే, నిజంగా అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఆయన ఆత్మాభిమానమే ఆత్మహత్యకు కారణమైందని తెలిసి 'అయ్యో పాపం' అనుకుంటున్నారు. 

"అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవడం కోసం రంగనాథ్ అవకాశాలు వదులుకున్నారు. 2500 రెంట్ కట్టే డబ్బు లేక, అక్కడి నుంచి 800 రెంట్ గల సింగిల్ బెడ్ రూమ్ కి మారినట్టుగా నాగేంద్రకుమార్ చెప్పారు. తాము పడుకోవడానికి కూడా అది సరిపోయేది కాదని అన్నారు. ఆయన సంపాదనతో ఏ దానధర్మాలు చేశారో తెలియదని చెప్పారు. ఎలాంటి నటుడు? ఎలాంటి ప్రయాణం? ఎలాంటి పరిస్థితి? అనుకుంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు. 



More Telugu News