కోనసీమ జిల్లాలో దారుణం .. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

  • ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో ఘటన 
  • గతంలో వాలంటీర్‌గా పని చేసిన పావులూరి కామరాజు
  • 2020లో కామరాజు అర్ధాంగి ఆత్మహత్య
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను హత్య చేసి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ హృదయవిదారక సంఘటన ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

ముగ్గురు విగతజీవులుగా గుర్తింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో పావులూరి కామరాజు (35), కుమారులు అభిరామ్ (10), గౌతమ్ (7) విగతజీవులుగా పడి ఉన్నారని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు.

కుటుంబ పరిస్థితులు విషాదానికి కారణమా?

కామరాజు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ గా పనిచేశారని పోలీసులు తెలిపారు. 2020లో ఆయన అర్ధాంగి ఆత్మహత్య చేసుకోవడంతో, అప్పటి నుంచి ఇద్దరు కుమారులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో మానసిక ఆవేదనకు గురై ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


More Telugu News