ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం.. 2026 భయానకమే!: బాబా వంగ జోస్యంపై కథనాలు
- 2025 కంటే వచ్చే సంవత్సరం దారుణంగా ఉంటుందని జోస్యం
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్, ఫిజికల్ కరెన్సీ పతనమవుతుందన్న బాబా వంగ
- మూడో ప్రపంచ యుద్ధం గురించి చెప్పిన బాబా వంగ
2025 సంవత్సరం అనేక అశాంతి సంఘటనలతో నిండి ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నుంచి ఆప్ఘనిస్థాన్ - పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల వరకు, రష్యా - ఉక్రెయిన్ వివాదం, అమెరికా - చైనా దేశాల మధ్య అధిక సుంకాలను విధించుకోవడం వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా, వివిధ దేశాల్లో సంభవించిన వరదలు, భూకంపాలు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి.
మరో రెండున్నర నెలల్లో 2025 ముగియనుండగా, 2026లో పరిస్థితులు మెరుగుపడాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే, బాబా వంగ జోస్యం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. బాబా వంగ బల్గేరియాకు చెందిన ప్రముఖ కాలజ్ఞానిగా పేరుగాంచారు. ఆమె మరణించి దాదాపు ముప్పై ఏళ్లు అవుతోంది. ఆమె జీవించి ఉన్న సమయంలో చెప్పిన పలు విషయాలు నిజమయ్యాయనే వాదనలు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి భవిష్యత్తు గురించి తెలుసుకునేవారు.
బాబా వంగ 2026లో సంభవించే విపత్తుల గురించి కూడా జోస్యం చెప్పారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ కథనాల ప్రకారం... 2026 సంవత్సరం ప్రస్తుత సంవత్సరం కంటే మరింత దారుణంగా ఉండవచ్చట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ తీవ్రంగా నష్టపోతాయి. ఆర్థిక మాంద్యం సంభవిస్తుందని, భౌతిక మరియు డిజిటల్ కరెన్సీలు భారీగా పతనమవుతాయని ఆ కథనం వెల్లడించింది. ఇదివరకే ఆర్థిక మాంద్యం, అస్థిరత్వంతో సతమతమవుతున్న దేశాలకు ఈ పరిస్థితి మరింత కష్టతరంగా మారవచ్చు.
బాబా వంగ మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా జోస్యం చెప్పారు. 2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఆమె చెప్పిన ఈ యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే, బాబా వంగ జోస్యాన్ని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు.