ఈ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది:'ఓజీ' విలన్ సుదేవ్ నాయర్!

  • యంగ్ విలన్ గా సుదేవ్ నాయర్
  • మలయాళంలో పాప్యులర్ ఆర్టిస్ట్ 
  • తెలుగులోను దక్కిన గుర్తింపు 
  • కన్నడలోను ఎంట్రీ ఇచ్చిన నటుడు

ఓటీటీ వచ్చిన తరువాత ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులు చాలామంది ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ కారణంగా వాళ్లు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే ప్రేక్షకులు గుర్తుపడుతున్నారు .. అభిమానిస్తున్నారు. అలా ముందుగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమై .. ఆ తరువాత టాలీవుడ్ కి వచ్చిన నటుడిగా 'సుదేవ్ నాయర్' కనిపిస్తారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యంగ్ విలన్ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను పుట్టింది ముంబైలో .. ఇప్పటికీ అమ్మానాన్న అక్కడే ఉంటారు. నేను మాత్రం 'త్రివేండ్రం'లో సెటిలయ్యాను. సినిమాలలో మా ఫ్యామిలీకి సంబంధించిన వారెవరూ లేరు. నటనలో శిక్షణ తీసుకుని నేనే ప్రయత్నాలు చేస్తూ .. అవకాశాలు సంపాదించుకుంటూ వెళ్లాను. సరైన గుర్తింపు రావడానికి పదేళ్లు పట్టింది. మొదటిసారి మమ్ముట్టి గారి కాంబినేషన్ లో చేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాను" అని చెప్పారు. 

"తెలుగులో నా మొదటి సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఆ తరువాత 'దేవర' .. 'ఓజీ' సినిమాలు చేశాను. ఈ రెండు సినిమాలలోని పాత్రలు నాకు మరింత గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఎన్టీఆర్ గారితో చాలా క్లోజ్ గా మాట్లాడే అవకాశం దక్కింది. పవన్ కల్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ వలన పెద్దగా మాట్లాడటం కుదరలేదు. ప్రస్తుతం కన్నడలో 'యశ్' తోను ఒక సినిమా చేస్తున్నాను" అని అన్నారు. 



More Telugu News