ఎల్ జీ అరంగేట్రం అదిరిపోయింది.. ఒక్కో షేరుపై లిస్టింగ్ లో రూ.570 లాభం
- 50 శాతం ప్రీమియంతో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ లిస్టింగ్
- ఇష్యూలో వెయ్యి రూపాయల షేరు.. పదిహేడు వందల వద్ద ట్రేడింగ్
- ఐపీఓలో 7 కోట్లకు పైగా షేర్లు.. తొలిరోజే పూర్తిగా సబ్‌స్క్రైబ్
ఇటీవల ఐపీఓకు వచ్చిన ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ లో అదరగొట్టింది. ఏకంగా 50 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.1,080 - రూ.1,140 గా కంపెనీ నిర్ణయించగా.. బీఎస్‌ఈలో ఈ షేరు రూ.1,715 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ.1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. దీంతో ఐపీఓలో షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై కనీసం రూ.570 వరకు లాభపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్ జీ అనుబంధ కంపెనీ ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల ఐపీఓ కు వచ్చింది.
దీనికి ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొత్తంగా 7,13,34,320 షేర్లకు గానూ 7,44,73,685 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. తొలిరోజే పూర్తిగా సబ్ స్క్రైబ్ కాగా.. తర్వాత 1.04 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. రూ.11,607 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 9న ముగిసింది. 10.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచడం ద్వారా రూ.15 వేల కోట్లను సమీకరించే లక్ష్యంతో ఎల్‌జీ ఈ ఐపీఓను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.