సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నారా భువనేశ్వరి

  • నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ అవార్డు
  • మై డియర్ భు అంటూ చంద్రబాబు ప్రేమపూర్వక అభినందనలు
  • మీరే నాకు దారి చూపే వెలుగు అంటూ నారా భువనేశ్వరి వినమ్ర స్పందన
ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త నారా భువనేశ్వరి తాజాగా 'ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025'కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన భార్యను అభినందిస్తూ ఒక పోస్ట్ చేశారు. "మై డియర్ భు, ఈ గౌరవం అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. నీ అంకితభావం, నిజాయతీ, బలం చుట్టూ ఉన్న అందరికీ, ముఖ్యంగా నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. అందుకు నారా భువనేశ్వరి వినమ్రంగా స్పందించారు. తన భర్త సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 

తన జీవితంలో చంద్రబాబు పాత్రను వివరిస్తూ భువనేశ్వరి హృద్యమైన మాటలను పంచుకున్నారు. "మీరే నాకు ఎల్లప్పుడూ బలమైన మద్దతుదారు, నన్ను ప్రోత్సహించే శక్తి, దారి చూపే వెలుగు" అని ఆమె పేర్కొన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ తన భర్త చూపించే నమ్మకం, ప్రేమలోని ఆప్యాయత ఎంతో బలాన్ని ఇస్తాయని ఆమె తెలిపారు.

"ఈ జీవిత ప్రయాణాన్ని మీతో కలిసి పంచుకోవడం నా అదృష్టం" అంటూ భువనేశ్వరి తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.


More Telugu News