ఆ భవనాల వాడకానికి సలహాలివ్వండి: ఏపీ ప్రభుత్వం

  • రుషికొండ భవనాల వినియోగంపై ప్రజల సూచనలు కోరిన ప్రభుత్వం
  • పర్యాటక శాఖకు మెయిల్ చేయాలన్న టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి
  • పౌరుల సూచనలపై మంత్రుల బృందం సమీక్ష
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ ల వినియోగంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది.

ప్రజలు తమ సలహాలు, సూచనలను rushikonda@aptdc.inకు మెయిల్‌ చేయాలని టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి కోరారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. ఆయా సంస్థల నుంచీ సూచనలు కోరుతామన్నారు. పౌరులు, సంస్థల నుంచి అందుకున్న సూచనలపై మంత్రుల బృందం సమీక్ష జరుపుతుందని వెల్లడించారు. అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి పేర్కొన్నారు.


More Telugu News