ముఖ్య ఎన్నికల అధికారికి బెదిరింపులు.. మమతా బెనర్జీ క్లిప్పింగ్ కావాలన్న ఈసీ

  • మనోజ్ అగర్వాల్‌ను మమతా బెనర్జీ బెదిరించినట్లుగా వార్తలు
  • తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం
  • అవినీతి ఆరోపణలు బయటపెడతానని మమతా బెదిరింపులు
పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్‌‍ను అవినీతి ఆరోపణల పేరిట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెదిరించినట్లు వార్తలు రావడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అందజేయాలని ఈసీ కోరినట్లు జాతీయ మీడియాలో కథనం వెలువడింది.

బెంగాల్ సీఈవో మనోజ్ అగర్వాల్ రాష్ట్రంలోని అధికారులను బెదిరిస్తున్నారని, తన పరిధిని దాటి వ్యవహరిస్తే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలను బహిర్గతం చేస్తానని మమతా బెనర్జీ ఇటీవల ఒక సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీని, దాని అనువాద ప్రతిని అందజేయాలని సీఈవో కార్యాలయానికి ఈసీ సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఎన్నికల సంఘానికి ఒక లేఖను సమర్పించింది. ఎన్నికల అధికారిని బెదిరించినందుకు ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.


More Telugu News