ట్రోఫీ ఇవ్వని నఖ్వీ.. ఐసీసీ పదవికే ఎసరు పెడుతున్న బీసీసీఐ!
- భారత్‌కు ఇప్పటికీ అందని ఆసియా కప్ ట్రోఫీ
- తానే స్వయంగా ఇస్తానంటూ పీసీబీ చీఫ్ నఖ్వీ మొండిపట్టు
- ఏసీసీ ఆఫీసులోనే ట్రోఫీని ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు
ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టుకు అప్పగించే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ మొండిగా వ్యవహరిస్తుండటంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ట్రోఫీని ఇవ్వకుండా నాటకాలాడుతున్న నఖ్వీపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచే ఆయన్ను తొలగించేందుకు భారత బోర్డు ఒక ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ ఆసియా కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి ట్రోఫీని తన వద్దే అట్టిపెట్టుకున్న నఖ్వీ, భారత కెప్టెన్ లేదా బీసీసీఐ ప్రతినిధి స్వయంగా తన వద్దకు వచ్చి తీసుకోవాలని షరతు పెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కార్యాలయంలోనే ఉందని ఏసీసీ వర్గాలు చెబుతున్నాయి. తన అనుమతి లేకుండా ట్రోఫీని అక్కడి నుంచి కదిలించవద్దని, ఎవరికీ అప్పగించవద్దని నఖ్వీ తన సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఆయన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
నఖ్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్ ట్రోఫీ నఖ్వీ వ్యక్తిగత ఆస్తి కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే గట్టిగా బదులిచ్చారు. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీని ఇవ్వడం ఆతిథ్య బోర్డు బాధ్యత అని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. పీటీఐ నివేదిక ప్రకారం, నఖ్వీ వైఖరి ఇలాగే కొనసాగితే, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి భారత బోర్డు వెనుకాడదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఐసీసీ బోర్డు నుంచి ఆయన్ను తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.