ఇది మామూలు పట్టుదల కాదు.. గాయాన్ని జయించి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళా పోలీస్!
- ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా మహిళా పోలీస్
- గంట వ్యవధిలో ఏకంగా 733 పుల్-అప్స్ పూర్తి చేసిన వైనం
- 2016 నాటి 725 పుల్-అప్స్ రికార్డును అధిగమించిన జేడ్ హెండర్సన్
- వాస్తవానికి 24 గంటల రికార్డుకు ప్రయత్నం
- చేతికి గాయం కావడంతో గంట రికార్డుపై దృష్టి
గంటలో 733 పుల్-అప్స్... ఈ మాట వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ, ఈ అసాధారణ ఫీట్‌ను ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి సుసాధ్యం చేసి చూపించారు. అసామాన్యమైన శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యంతో దాదాపు పదేళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్ బుక్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల పోలీస్ అధికారిణి జేడ్ హెండర్సన్, ఆగస్టు 22న గోల్డ్ కోస్ట్‌లో ఈ ఘనత సాధించారు. గంట వ్యవధిలో ఆమె ఏకధాటిగా 733 పుల్-అప్స్ పూర్తి చేశారు. అంటే సగటున నిమిషానికి 12 పుల్-అప్స్‌కు పైగానే తీశారు. దీంతో 2016లో ఆస్ట్రేలియాకే చెందిన ఎవా క్లార్క్ నెలకొల్పిన 725 పుల్-అప్స్ రికార్డును జేడ్ బద్దలు కొట్టారు.
వాస్తవానికి జేడ్ మొదట 24 గంటల పుల్-అప్స్ రికార్డుపై దృష్టి పెట్టారు. అయితే, దాని కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆమె చేతి కండరం, స్నాయువు పాక్షికంగా దెబ్బతిన్నాయి. "12 గంటల్లో 3,500 పుల్-అప్స్ చేసినప్పుడు గాయపడ్డాను. దీంతో దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది" అని ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులకు తెలిపారు.
ఆ గాయం తర్వాత, సుదీర్ఘ రికార్డుకు ప్రయత్నిస్తే మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని భావించి, గంట రికార్డుపై దృష్టి సారించారు. "ఎవరూ చేయలేనిది సాధించాలనే ఆలోచన నాకు నచ్చింది. నా శరీరం, మనసు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాయో పరీక్షించుకోవాలనుకున్నా" అని జేడ్ వివరించారు. రికార్డు ప్రయత్నంలో పాత రికార్డు కంటే కొన్ని ఎక్కువ చేయాలని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నానని, చివరికి 733 పూర్తి చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె అన్నారు. తన పూర్తి శక్తియుక్తులను ఉపయోగించి ఈ ఘనత సాధించానని, తన విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.