రేపు కోయంబత్తూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు
- ఎఫ్‌ఎంఏఈ-నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025లో పాల్గొననున్న కేటీఆర్
- కోయంబత్తూరులోని కుమరగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో రేపు కార్యక్రమం
- యువతలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ కార్యక్రమం
ఈ విషయాన్ని బీఆర్ఎస్ తన అధికారిక సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలకు కేటీఆర్ హాజరవుతుండడం గర్వకారణమని పేర్కొంది. యువతలో ఆవిష్కరణా దృక్పథం, సాంకేతిక ప్రోత్సాహం, మోటార్‌స్పోర్ట్స్ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని తెలిపింది.