Rukmini Vasanth: అందాల రాకుమారికి పెరుగుతున్న ఆఫర్లు!

Rukmini Vasanth Special
  • అందాల నాయికగా రుక్మిణి వసంత్ 
  • నిదానంగా మొదలైన కెరియర్ 
  • 'కాంతార చాప్టర్ 1'తో బ్లాక్ బస్టర్ 
  • ఎన్టీఆర్ జోడిగా చేస్తున్న 'డ్రాగన్'
  • సౌత్ నుంచి  క్యూ కడుతున్న ఆఫర్లు

కొంతమంది హీరోయిన్లకు స్టార్ హీరోల జోడీకట్టే ఛాన్స్ ఆరంభంలోనే వస్తుంది. మరికొంత మంది హీరోయిన్స్ కి అలాంటి అవకాశాలు కాస్త లేట్ గా వస్తాయి. ఇంకొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాలలో వేషాల కోసం తొందరపడకుండా, నిదానంగా తమ కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటివారి ప్రతిభకు అదృష్టం తోడైతే భారీ సినిమాలు నేరుగా వచ్చి పలకరిస్తాయి. సంచలన విజయాన్ని దోసిట్లో పెడతాయి. అలాంటి హీరోయిన్స్ లో ఒకరిగా రుక్మిణి వసంత్ కనిపిస్తుంది. 

'సప్త సాగరాలు దాటి' సినిమా చూసినవారు, అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంది అనుకున్నారు. ఈ మధ్య కాలంలో చీరకట్టులో ఇంత అందంగా ఉన్న హీరోయిన్స్ ను చూడలేదని చెప్పుకున్నారు. అయితే ఈ అమ్మాయి చీరకట్టులోనే బాగుంటుందనే అభిప్రాయాలు పెరుగుతూ ఉండటంతో, ఆ ముద్ర నుంచి బయటపడటానికి .. గ్లామరస్ గా మెరవడానికి రుక్మిణి ప్రయత్నం చేస్తూ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన 'కాంతార చాప్టర్ 1' ఆమె ముచ్చట తీర్చింది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో ఆమె గ్లామర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిల్చి వేస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడతో పాటు, తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి ఆఫర్లు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు ఆడియన్స్ మాత్రం వెంకటేశ్ .. పవన్ కల్యాణ్ .. ప్రభాస్ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికగా ఈ బ్యూటీ సరిగ్గా కుదురుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. త్వరలోనే వారి ముచ్చట తీరుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ జోడీగా 'డ్రాగన్' చేస్తున్న సంగతి తెలిసిందే. 

Rukmini Vasanth
Rukmini Vasanth offers
Sapta Sagaralu Dati
Kantara Chapter 1
Telugu movies
Kannada actress
Dragon movie
NTR movie
Pan India movies
Venkatesh Prabhas Pawan Kalyan

More Telugu News